కాగజ్ నగర్, వెలుగు: క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, ఆసిఫాబాద్ జిల్లా పార్టీ అబ్జర్వర్ డాక్టర్ రియాజ్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ విస్తరణలో భాగంగా శనివారం కాగజ్ నగర్లోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో నిర్వహించిన సిర్పూర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు ఎంతటి వారైనా సహించదని హెచ్చరించారు.
ఐకమత్యంతో నడిచి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం జిల్లా కార్యవర్గంలో పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
