రాహుల్​పై అనర్హతవేటుకు నిరసనగా కాంగ్రెస్​ దీక్షలు

రాహుల్​పై అనర్హతవేటుకు నిరసనగా కాంగ్రెస్​ దీక్షలు

ఢిల్లీ ​‘సంకల్ప్ సత్యాగ్రహ’లో పాల్గొన్న ఖర్గే, ప్రియాంక

రాహుల్​ను గతంలో ద్రోహి అనడంపై  ప్రియాంక ఫైర్

దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం మాది

అలాంటి కుటుంబాన్ని బీజేపీ నేతలు నిత్యం కించపరుస్తున్నరని ఆరోపణలు

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లోని మహాత్మా గాంధీ విగ్రహాల ముందు కాంగ్రెస్ నేతలు ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రం వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలోని రాజ్​ఘాట్​లో దీక్షకు అనుమతివ్వబోమని పోలీసులు స్పష్టం చేసినా.. పెద్దఎత్తున నేతలు తరలివచ్చారు. దీంతో ఆ ఏరియాలో 144 సెక్షన్​ విధించారు. దీంతో రాజ్​ఘాట్ బయట ఏర్పాటు చేసిన సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో పార్టీ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌‌ నేతలు పాల్గొన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేనికైనా సిద్ధం

‘‘గాంధీ ఫ్యామిలీని ప్రతీ రోజు బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. రాహుల్​ను దేశ వ్యతిరేకి, ద్రోహి, మీర్ జాఫర్ అంటూ పిలుస్తున్నారు. అమరుడి కొడుకును అవమానించినా ఎవరిపైనా కేసు నమోదు కాలె.. శిక్ష పడలేదని అన్నారు. అమరవీరుడు రాజీవ్​ గాంధీ పిల్లలం.. మేం ఎన్నటికీ దేశాన్ని అవమానించబోం” అని ప్రియాంక తేల్చి చెప్పారు. ‘నెహ్రూ’ సర్ నేమ్​ను వీళ్లెందుకు ఉపయోగించరంటూ పార్లమెంట్​లో మోడీ ప్రశ్నించారని  ప్రియాంక గుర్తు చేశారు. ‘‘నా కుటుంబం రక్తం చిందించి దేశంలో ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది. డెమోక్రసీని కాపాడేందుకు ఏం చేయడానికైనా మేం సిద్ధం” అని ప్రియాంక ఫైర్ అయ్యారు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వర్సిటీల్లో చదివిన రాహుల్​ను ‘పప్పు’ అనడంపై నా ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 

దేశ సంపదను ఒక్కరికి దోచిపెడుతన్నరు..

ఎన్నోరకాలుగా అవమానించినా మౌనంగానే ఉన్నామని ప్రియాంక అన్నారు. ‘‘ఒక వ్యక్తిని ఎంత అవమానిస్తారు? దేశ సంపదనంతా ఒక్కడికి దోచిపెడ్తున్నరు. దీనిపై నిలదీస్తే తొక్కేస్తున్నరు. ఒక వ్యక్తిని కాపాడేందుకు మొత్తం కేబినెట్, ప్రభుత్వం, ఎంపీలు ప్రయత్నిస్తున్నరు. ఎవరీ అదానీ?” అని ప్రశ్నించారు. ‘ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్​ను అడ్డుకునేందుకు కేంద్రం ఎంచుకున్న మార్గం మంచిది కాదు” అని ప్రియాంక విమర్శించారు.

ఓబీసీల కోసం ఎంతో చేశాం: గెహ్లాట్​

ఓబీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. తాను కూడా ఓబీసీ అని, మూడుసార్లు సీఎంగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వారిని బీజేపీ కాపాడుతున్నదని ఆరోపించారు. ఓబీసీలను బీజేపీ మిస్ లీడ్ చేస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, అదానీపై చర్చించాలని పట్టుబట్టడంతోనే రాహుల్​పై అనర్హత వేటు వేయించారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకే వేధింపులకు దిగుతున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి: ఖర్గే

నీరవ్​ మోడీ, లలిత్​ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లను విమర్శిస్తే బీజేపీకి ఎందుకంత బాధ కలుగుతున్న దని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని విమర్శించా రు. దేశం కోసం పాటుపడుతున్న వారిని బీజేపీ హింసిస్తోంద ని, ఇలాంటి వారిని కాపాడుతున్నదని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫ్రీడం ఆఫ్​ స్పీచ్​ను రక్షించేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. రాహుల్​కు అండగా నిలిచిన పార్టీలన్నింటికీ ధన్యవాదాలు చెప్పారు.

అణిచివేత మోడీకి అలవాటైంది: వేణుగోపాల్

రాజ్​ఘాట్​లో ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్​ సీనియర్​ లీడర్ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. పార్లమెంట్​లో తమ గొంతునొక్కిన ప్రభుత్వం.. ఇప్పుడు మహాత్మా గాంధీ సమాధి వద్ద శాంతియుతంగా దీక్ష చేపట్టేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షాల నిరసనను అణిచివేయడం మోడీ ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. తమను ఎవరూ ఆపలేరని, సత్యం కోసం నిరంకుశపాలనపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రాజ్​ఘాట్ ముందు నిర్వహించిన దీక్షలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు చిదంబరం, సల్మాన్ ఖుర్షిద్, జైరామ్ రమేశ్, ముకుల్ వాస్నిక్, పవన్ కుమార్ బన్సల్, శక్తిసిన్హా గోహిల్, జ్యోతిమణి, ప్రతిభా సింగ్, మనీశ్​ఛత్రాతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్విట్టర్ బయో మార్చేసిన రాహుల్​

రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోను మార్చేశారు. గతంలో మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎంపీ అని ఉండగా ఇప్పుడు దాన్ని ‘‘మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’’గా మార్చుకున్నా రు. ప్రస్తుతం ఇది సోషల్‌‌మీడియాలో ట్రెడింగ్‌‌ అవుతున్నది. 2019 ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌‌లో రాహుల్‌‌ మాట్లాడు తూ.. ‘‘దొంగలంతా మోడీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ క్రమంలో రాహుల్​పై పరువు నష్టం దావా నమోదైంది. ఈ కేసులో సూర‌‌త్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడం తో రాహుల్​ పై అన‌‌ర్హత వేటు ప‌‌డింది.