ఎమ్మెల్యే వివేక్​పై దుష్ప్రచారం చేస్తే ఊరుకోం :కాంగ్రెస్ ​నేతలు

ఎమ్మెల్యే వివేక్​పై దుష్ప్రచారం చేస్తే ఊరుకోం :కాంగ్రెస్ ​నేతలు

చెన్నూరు, వెలుగు: చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని కాంగ్రెస్​నేతలు కోరారు. బుధవారం స్థానిక ప్రెస్​క్లబ్​లో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని.. రోజురోజుకు వారికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని, అది చూసి ఓర్వలేక పాత ఎస్టిమేషన్ కాపీలు సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ ​అయ్యారు. తమ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నేతలు హేమవంత రెడ్డి, రఘునందన్ రెడ్డి, ఇస్మాయిల్, బి.సత్యనారాయణ, రాకేశ్, ఓదెలు, సత్యనారాయణ రెడ్డి, బాపగౌడ్, తిరుపతి, మల్లేశ్, మహేశ్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.