కోటగిరి, వెలుగు : పోతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ పోతంగల్ మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ నుంచి హున్సా గ్రామం వరకు 11 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రూ . 200 కోట్లతో తమ మండలంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయటం అదృష్టమన్నారు. పోచారం, కాసుల కృషి వల్ల తమ నియోజకవర్గం లో అభివృధ్ది పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, యూత్ కాంగ్రెస్ లీడర్ అభిషేక్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ సర్పంచ్ వర్ని శంకర్, మాజీ ఎంపీటీసీ కేశ వీరేశం, గంధపు రాజు, దత్తు, పుల్కంటి సాయిలు, ఎజాస్ ఖాన్, మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ ఇమ్మాయిల్, వెంకట్ రెడ్డి, లింగప్ప, దిగంబర్ పటేల్, శివరాజ్ పటేల్ పాల్గొన్నారు
