- సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై నివేదిక అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేత
నిర్మల్, వెలుగు: జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్ లో కలిశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్యాం నాయక్, డైరీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు జూపల్లిని కలిశారు.
పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ పదవులను గెలుచుకుందని వారు వివరించారు. దీంతో నేతలందరినీ మంత్రి అభినందించారు. నిర్మల్ నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల ఫలితాలపై నివేదికను నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు మంత్రికి అందజేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి జూపల్లికి అందించారు.
