
శివ్వంపేట, తుప్రాన్, సిద్దిపేట, కొహెడ, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని శుక్రవారం హైదరాబాద్లో పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, తూప్రాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు మామిండ్ల కృష్ణ, బజారు విశ్వరాజ్, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పూజల హరికృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షుడు చొప్పదండి చంద్రశేఖర్, కౌన్సిలర్స్ సాకీ ఆనంద్, రియాజ్, కాంగ్రెస్ నాయకులు గుండు రవితేజ, బయ్యారం యాదగిరి, బత్తుల ప్రశాంత్, కోహెడ మండలం శ్రీరాములపల్లికి చెందిన మాల సంఘం నాయకుడు మరాటి మణిదీప్ మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బడుగు బలహీన వర్గాల కోసం పని చేసిన కాకా ఫ్యామిలీ నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.