ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ లీడర్లు

ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ లీడర్లు

దాదాపు ఏడేళ్ల తర్వాత క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిశారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటివరకు విపక్ష నేతలకు అపాయిట్మెంట్ ఇవ్వని సీఎం.. ఇవాళ కాంగ్రెస్ నేతలను కలవడం ఆసక్తిగా మారింది. లాకప్ డెత్ ఐన మరియమ్మ విషయంపై మాట్లాడ్డానికే సీఎంను కలిశామని భట్టి చెప్పారు. దీనికోసం మూడ్రోజుల క్రితమే అపాయిట్మెంట్ అడిగామని భట్టి అన్నారు. అయితే కేసీఆరే కాంగ్రెస్ నేతలను పిలిపించుకున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. గతంలో ఎన్నో సమస్యలపై సీఎంకు లెటర్లు రాసినా.. అపాయిట్మెంట్ అడిగినా క్యాంప్ ఆఫీసు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సీఎం స్పందిచకపోవడంతో.. కాంగ్రెస్ నేతల గవర్నర్ ను కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నిక, ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో వీళ్ల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు సీఎంను కలవడంతో.. బీజేపీ లీడర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అంటూ మండిపడుతున్నారు బీజేపీ నేతలు. 

క్యాంప్ ఆఫీసులో  సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కతో పాటు జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇతర నేతలు సీఎంను కలిశారు. ఇటీవల లాకప్ డెత్ ఐన మరియమ్మ విషయంతో పాటు దళితులపై జరుగుతున్న దాడులను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు భట్టి. మరియమ్మ కొడుక్కి ఉద్యోగం, పిల్లలకు ఆర్థికసాయంతో పాటు ఇల్లు ఇవ్వడానికి సీఎం ఒప్పుకున్నారని చెప్పారు భట్టి.