నర్సాపూర్ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం : డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్

నర్సాపూర్ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం : డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్
  • డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్

 నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. 

ఆదివారం నర్సాపూర్ పట్టణంలోని 6, 8, 12, 13వ వార్డుల్లో మున్సిపల్​ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.