
తమకు చెప్పకుండా పోలీసులు దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ గౌడ్లు విమర్శించారు. మహిళలను కించ పరిచే విధంగా కాంగ్రెస్ పోస్టులు పెట్టలేదని అన్నారు. అప్పుడు నిజాంను చూశామని.. ఇప్పుడు కేసీఆర్ను చూస్తున్నామని విమర్శించారు. శాంతియుతంగా డీజీపీని కలిసేందుకు వెళుతుంటే.. పోలీసులు తమను అడ్డుకోవడం దారుణమన్నారు.
ప్రస్తుతం గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ భవన్ గేటు దగ్గర బైఠాయించి కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి నిరసనగా.. DGPని కలవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. DGP ఆఫీసుకు బయల్దేరిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. గాంధీభవన్ నుంచి నేతలు బయటకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు.