
మునుగోడు బైపోల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీ భవన్ లో భేటీ కానున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు పాల్కొననున్నారు.
గాంధీ భవన్ లో ముఖ్య నేతల భేటీ నేపథ్యంలో మునుగోడు టికెట్ ఆశిస్తున్న వారకి గాంధీ భవన్ రావాలని పిలుపు అందింది. ఈ నేపథ్యంలో చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, కైలాష్ నేత, పల్లె రవి తదతరులు గాంధీ భవన్ చేరుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డిఉదయం నుంచి అక్కడే ఉన్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ముఖ్యనేతలు వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని చెప్పనున్నట్లు సమాచారం.