కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎంపీ.సురేశ్కుమార్ షెట్కార్

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎంపీ.సురేశ్కుమార్ షెట్కార్

జహీరాబాద్, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని జహీరాబాద్ ఎంపీ.సురేశ్​కుమార్ షెట్కార్, మాజీ మంత్రి, కాంగ్రెస్​జహీరాబాద్ నియోజకవర్గ ఇన్​చార్జి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కోరారు. జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంప్​ఆఫీస్​లో జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల నాయకులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్​ఎన్నికల్లో అందరూ సమష్టిగా పనిచేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. 

టీజీఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, కాంగ్రెస్ సీనియర్​నాయకుడు ఉజ్వల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, మండలాల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, మక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్ అలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుం, కోహిర్ పట్టణ అధ్యక్షుడు శంషీర్ , మాజీ ఎంపీపీ షౌకత్ అలీ తదితరులున్నారు.