హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. షేక్ పేట్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం సాధించింది. తొలి రౌండ్లో కాంగ్రెస్కు 8926, బీఆర్ఎస్కు 8864 పడ్డాయి. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల లీడ్ దక్కింది. ఈవీఎంల కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీకి 10 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం సాధించింది.
ఈవీఎం మొదటి రౌండ్ వివరాలు:
- కాంగ్రెస్కు పోలైన ఓట్లు 8926
- బీఆర్ఎస్కు పోలైన ఓట్లు- 8864
- మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల లీడ్
