మహిళలకు కుటీర పరిశ్రమల ఏర్పాటు చేస్తాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

మహిళలకు కుటీర పరిశ్రమల ఏర్పాటు చేస్తాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

    వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: స్థానిక ఉపాధి కల్పించేందుకు జోగిపేట  పరిసర ప్రాంతాల్లోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తానని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం ఆయన అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్‌‌ ‌‌  అభ్యర్థులకు మద్దతుగా 1,4,5,6,7,8,9 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు.  జోగిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

అందోల్​ శివారులో  400 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  గత ప్రభుత్వంలో మహిళలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర్‌‌ ‌‌ , వడ్డీలేని రుణాలు అందింస్తున్నామని  అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.