పెండ్లిండ్లు ఆగినయ్.. ప్రభుత్వానికి ఉసురు తాకుతది

పెండ్లిండ్లు ఆగినయ్.. ప్రభుత్వానికి ఉసురు తాకుతది

రిజిస్ట్రేషన్లపై ప్రజలు ఆందోళనకు దిగితే… ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ తెలిసి చేస్తున్నాడో… తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆడపిల్లల తల్లి తండ్రులు బిడ్డ పెళ్లికోసం ఆస్తులు ఆమ్ముకుందాం అనుకున్న అమ్ముకొలేని పరిస్తితి ఉందన్నారు. ప్రభుత్వం కారణంగా ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయన్నారు. ప్రజల ఉసురు ప్రభుత్వానికి తాకుతుందన్న జగ్గారెడ్డి.. అది ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దని ప్రభుత్వంలో ఏ అధికారి ఇలాంటి సూచనలు చేస్తున్నాడో అర్థం కావడంలేదన్నారు.

నిజాం కాలం నుండే ఆస్తులకు భద్రత ఉందని..  ఐదు నెలల నుండి రిజిస్ట్రేషన్ శాఖ నిలిచి పోయిందన్నారు. కరోనా కాలంలో ఆస్తులు అమ్ముకునో… బ్యాంక్ లోన్లు  తెచ్చుకుందాం అనుకున్నా వీలు కాలేదని..అలా ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారన్నారు.  CSకి కరోనా వస్తే… ఆయన చేతిలో డబ్బులు లేకుంటే డబ్బులు ఎలా తెచ్చుకోవాలో ఆయనకు తెలిసేదన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను బంధు చేయడం వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో అధికారులకు తెలియదని..జనం సమస్యలు అధికారులు చూస్తున్నారో లేదో అర్థం కావడం లేదన్నారు. అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలన్న ఆయన..రాష్ట్రాన్ని దివాళా తీయకండన్నారు. కోర్ట్ ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్లు ఆపారని..పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని కేసీఆర్ అన్నారు కానీ.. అమలు కావడం లేదన్నారు. పాత పద్దతిలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలిందని, సీఎం..సీఎస్ లు తక్షణమే పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. LRs మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని..కేటీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.