తెలంగాణలో ఫార్మా మాఫియా.. బ్లాక్ మార్కెట్ దందా

V6 Velugu Posted on May 17, 2021

  • మన వద్ద తయారయ్యే వ్యాక్సిన్ మనకే దొరకడం లేదంటే సిగ్గుచేటు
  • హెట్రో కంపెనీని కేంద్రం ఆధీనంలోకి తీసుకుని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడాలి
  • అవసరమైతే నేనే హెట్రో కంపెనీ వద్దకు వెళ్లి బైఠాయిస్తా
  • మంత్రి  తలసాని కామెడీ చేయొద్దు
  • రోజూ ఎంత మంది చస్తున్నారో బయటకొచ్చి చూడు
  • గాంధీలో ఎంతమంది చస్తున్నారో కిషన్ రెడ్డిని అడిగి తెలుసుకో
  • తెలంగాణలో పరిస్థితిపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

హైదరాబాద్: కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలో ఫార్మా మాఫియా రాజ్యమేలుతోందని.. బ్లాక్ మార్కెట్ దందా అడ్డుకునే వారే కనిపించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ఎన్నడూలేనంత అధ్వాన్న పరిస్థితి నెలకొందనని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫార్మా మాఫియా అనే చర్చ నడుస్తోందని, అసలు రాష్ట్రంలో ఏం నడుస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వం వుందా లేదా అనే అనుమానం కలుగుతోందని.. కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.  సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మెడిసిన్, వ్యాక్సిన్లు అందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్ని దొంగ మాటలు ఇంట్లో కూర్చుని మాట్లాడుతుండని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీనివాస్ యాదవ్ కామెడీ  చేయకండి.. కరోనా తో రోజు ఎంతమంది చనిపోయారో.. బయటికి వచ్చి చూడు..గాంధీలో రోజు ఎంతమంది చనిపోతున్నారో.. కిషన్ రెడ్డి వద్దకు వెళ్లి తెలుసుకో.. అని జగ్గారెడ్డి సలహా ఇచ్చారు. హెట్రో కంపెనీ దగ్గర బైఠాయిస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి మన వద్ద తయారయ్యే వ్యాక్సిన్ మనకే దొరకడం లేదంటే సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రెమీడిసీవర్ ఇంజెక్షన్ కరోనా రోగులకు సంజీవనిలా పనిచేస్తోందని.. కాబట్టి రెమిడిసీవర్ ఎక్కడికెళ్లినా దొరికేవిధంగా కేంద్రం భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే  హెట్రో కంపెనీ వద్ద నిరసనకు సిద్ధమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లలో కరోనా రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కరోనా రోగులకు సంజీవనిలా పనిచేస్తున్న రెమిడీసీవర్ ఇంజెక్షన్, ఆక్సిజన్  దొరకక ప్రజలు పిట్టలా రాలిపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో రోజు రెండు వందలకు పైగా చనిపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెమిడీసీవర్ ఇంజెక్షన్ తయారు చేసే కంపెనీ మన రాష్ట్రంలో ఉన్నా.. మనకు రెమిడీసీవర్ ఇంజెక్షన్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
బీజేపీ పాలిత రాష్ట్రాలకు దొంగచాటుగా పంపుతున్నారు

దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాలకు రెమిడీవేర్ ఇంజక్షన్ దొంగచాటున పంపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని అడిగి రాష్ట్రానికి  రెమిడీసీవర్ ఇంజెక్షన్లు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు.రెమిడీసీవర్ ఇంజెక్షన్ ఎక్కడకి వెళ్లినా దొరికేవిధంగా కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాలల్సిన అవసరం ఉందని..రోజు వందల సంఖ్యలో మరణాలు జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హెట్రో కంపెనీ కేంద్రం చేతుల్లోకి తీసుకొని రెమిడీస్ వేర్ ఇంజక్షన్ అందరికి అందేలా చూడాలని, పట్టించుకోకపోతే తాను స్వయంగా  హెట్రో కంపెనీ దగ్గరకు పోయి బైఠాయిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. మన దగ్గర తయారవుతున్న రెమిడీసీవర్ ఇంజెక్షన్ మనకే దొరకడం లేదు అంటే దానికంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని దీని కోసం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రెమిడీసీవర్ ఇంజెక్షన్ అందరికీ దొరికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ రోజు దేశంలో ఈ పరిస్థితి ఉండేదే కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలు బతకాలంటే పథకాలు కాదు.. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. కేంద్రంతో పోరాటంలో టీఆర్ ఎస్ పార్టీ విఫలమైందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. 

Tagged Congress MLA Jagga Reddy, , gandhi bhavan today, jaggared sensational comments, pharma mafia, black market in Telangana

Latest Videos

Subscribe Now

More News