డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్

డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్

హైదరాబాద్: బ్లాక్ మనీ దాచుకునేందుకే కేసీఆర్ హెటెరో పార్థసారథికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యమకారులను కాదని కేసీఆర్ వ్యాపారులకు రాజ్యసభ టికెట్లు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి రాజ్యసభ టికెట్లను అమ్ముకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. వ్యాపారులుగా సీఎంను కలిసేందుకు ప్రోటోకాల్ సమస్య వస్తుందన్న కారణంతోనే వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. రాజ్యసభకు పంపితే ఎంపీ హోదాలో కేసీఆర్ ను ఎప్పుడైనా కలిసే అవకాశం లభిస్తుందని విమర్శించారు. గతంలో ఐటీ రైడ్ లో పార్థసారధి వద్ద రూ.500 కోట్లు దొరికిన విషయాన్ని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. అలాంటి వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలకు టికెట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరని జగ్గారెడ్డి అన్నారు.

ఎంఐఎం, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని హైదరాబాద్ లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేయడాన్ని తప్పుబట్టారు. అసదుద్దీన్ ఒవైసీకి హైదరాబాద్ వదిలి వేరే చోట పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్ఫష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్కు బంగారు పతకం

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన అఖిలేష్