
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ఇవాళ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. సీఎం ఆహ్వానం మేరకు తుగ్లక్ రోడ్డులో కేసీఆర్ బస చేసిన నివాసానికి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఘన స్వాగతం పలికి సన్మానించారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
ఇక సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా.. మే 22వ తేదీ ఆదివారం చండీగఢ్ వెళ్లి పంజాబ్ రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమం చేస్తూ చనిపోయిన పంజాబ్ రైతుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి రూ. రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందిస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌తో కలిసి ఒక్కో రైతు కుటుంబానికి చెక్కులు ఇస్తారు సీఎం కేసీఆర్.
మే 26న ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు. 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధిలో అన్నా హజారేతో భేటీ అవుతారు. ఈ నెల 29 లేదా 30న బెంగాల్, బీహార్ పర్యటనకు వెళ్తారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కోసం కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వాటికి కొనసాగింపుగానే ఈ పర్యటన కొనసాగుతోందని వెల్లడిస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.
మరిన్ని వార్తల కోసం : -
సీఎం కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు
సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ