
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో భారత్ అదరగొట్టింది. సౌత్ కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్-2లో పురుషుల కాంపౌండ్ జట్టు గోల్డ్ మెడల్ను సాధించింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్లతో కూడిన టీమ్..ఫ్రాన్స్పై 232-230 స్కోరు తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు వరల్డ్ కప్లలో పురుషుల కాంపౌండ్ జట్టు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.
Back to back win for India in Gwangju???#ArcheryWorldCup pic.twitter.com/IWFfsHUhXq
— World Archery (@worldarchery) May 21, 2022
ఇదే ఏడాది ఏప్రిల్‌లో అంటాల్యలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-1 ఫైనల్‌లోనూ భారత్ బంగారు పతకాన్ని దక్కించుకుంది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్‌ల త్రయం ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఒక పాయింట్ తేడాతో ఓడించి..స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
మరిన్ని వార్తల కోసం..
దిగ్గజ క్రికెటర్..దిగజారుడు కామెంట్స్
ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన
థాయిలాండ్ ఓపెన్లో సింధు ఓటమి