
- ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్
హైదరాబాద్: రాష్ట్రానికి రానున్న మూడ్రోజులు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని.. దీని ప్రభావంతో ఇవాళ కొన్నిచోట్ల , రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉదని తెలిపారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
తండ్రైన నటుడు సుధాకర్ కోమాకుల.. ఏ పేరు పెట్టారో తెలుసా
ఆ సినిమా చూస్తే కన్నీళ్లొస్తాయి
కడుపుబ్బ నవ్వుకునే సినిమా ఎఫ్ 3