
సర్కారువారి పాట మూవీ విజయవంతం కావడంతో హీరో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత విడుదలైన మహేస్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో మహేష్ బాబు సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాపిడ్ ఫైర్ రౌండ్ లో మహేష్ బాబు పంచుకున్న కొన్ని సరదా సంగతులు మీ కోసం..
మిమ్ముల్ని ఎక్కువగా ఏ నిక్ నేమ్ తో పిలుస్తారు?
మహేష్ బాబు : నాని
సూపర్ స్టార్ ఎక్కువగా భయపడే విషయం ?
మహేష్ బాబు : నా దర్శకుల అంచనాలు అందుకోలేనేమోనని ఎక్కువగా భయపడుతుంటాను.
మీరు ఇప్పటివరకూ చేసిన అడ్వెంచర్ ఏది ?
మహేష్ బాబు : న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేశాను.
మీరు ఎక్కువగా వాడే ఊత పదం..?
మహేష్ బాబు : బ్యూటీపుల్ పదాన్ని ఎక్కువగా వాడుతా.
ఇప్పటి వరకూ మీకు కన్నీళ్లు పెట్టించిన సినిమా ఏది ?
మహేష్ బాబు : ది లయన్ కింగ్ సినిమా చూసినప్పుడల్లా కన్నీళ్లు వస్తాయి.