
థాయిలాండ్ ఓపెన్లో పీవీ సింధు ఓడిపోయింది. మహిళల సింగిల్స్ సెమీస్లో ఆమె టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చెన్ యూ ఫీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవిచూసింది. 43 నిమిషాల పాటు హోరా హోరీగా సాగిన సెమీస్ మొదట గేమ్లో ఇరువురు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే కీలక సమయాల్లో చైనీస్ ప్లేయర్ పాయింట్లు సాధించి 21-17 స్కోరుతో తొలి గేమ్ను సొంతం చేసుకుని 1-0తో ఆధక్యంలో నిలిచింది. రెండో గేమ్లోనూ చెనా ప్లేయర్ జోరు కొనసాగించింది. పీవీ సింధుపై అద్భుతమైన షాట్లు, ష్మాష్లతో విరుచుకుపడింది. ప్రత్యర్థి జోరును అంచనా వేయలేని సింధు కీలక తప్పిదాలు చేసింది. దీన్ని క్యాష్ చేసుకున్న చెన్ యూ ఫీ..రెండో గేమ్ను 21-16తో దక్కించుకుని ఫైనల్లో అడుగుపెట్టింది.
P.V Sindhu goes down to reigning Olympic Champion Chen Yufei 17-21, 16-21 in Semis of Thailand Open (BWF World Tour Super 500).
— India_AllSports (@India_AllSports) May 21, 2022
END of Indian challenge in the tournament. #ThailandOpen2022 pic.twitter.com/93AliHqp55