దిగ్గజ క్రికెటర్..దిగజారుడు కామెంట్స్

దిగ్గజ క్రికెటర్..దిగజారుడు కామెంట్స్

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్కు ఏజ్ పెరిగింది కానీ..బుద్ది మాత్రం పెరగలేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. దిగ్గజ క్రికెటర్గా పేరు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్ ..కామెంటేటర్గా చేసిన వ్యాఖ్యలతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

అసలేమైంది..
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన  మ్యాచ్లో .. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై రాజస్థాన్కు 151 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఛేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ తడబడింది.  రాజస్థాన్ గెలవాలంటే 52 బంతుల్లో 75 పరుగులు చేయాలి. ఈ దశలో హెట్మెయర్ క్రీజులోకి వచ్చాడు. ఇదే సమయంలో కామెంటేటర్గా ఉన్న సునీల్ గవాస్కర్..హెట్ మెయిర్పై హద్దులు దాటి మాట్లాడాడు. రీసెంట్గా హెట్ మెయర్ వైఫ్ డెలీవరి అయింది..మరి ఈ గేమ్లో హెట్మెయర్ రాజస్థాన్కు డెలివరీ చేస్తాడా అంటూ అనుచిత కామెంట్స్ చేశాడు. అయితే గవాస్కర్ సరదాగా చేసిన ఈ కామెంట్స్ ..ప్రేక్షకులకు కోపం తెప్పించాయి. 

 

గవాస్కర్ పై ఫ్యాన్స్ గరం..
దిగ్గజ క్రికెటర్గా పేరు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై ఫ్యాన్స్  మండిపడుతున్నారు. మ్యాచ్లో ఆటగాళ్ల వైఫ్ల గురించి  ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసినందుకు గవాస్కర్ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో సునీల్ గవాస్కర్ బ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.


ఐపీఎల్ 2022 లీగ్ దశలో హెట్ మెయర్ పెటర్నీటీ లీవ్ మీద ఇంటికి వెళ్లొచ్చాడు. అతని భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని భావించిన హెట్‌మెయర్..కొద్ది రోజుల పాటు ఈ బ్రేక్ తీసుకున్నాడు. అతని సతీమణి డెలివరీ అయ్యాక..తిరిగి  జట్టుతో చేరాడు. 

సునీల్ గవాస్కర్ గతంలోనూ నోరు జారాడు..
గవాస్కర్ ఆటగాళ్ల వైఫ్లపై నోరు జారడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కోహ్లీ సతీమణి అనుష్క్ శర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..ఆమె చేతిలో తిట్లు తిన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యాలను వివరిస్తూ..లాక్ డౌన్లో కోహ్లీకి సరైన సదుపాయాలు లేక అనుష్క బంతులతో ప్రాక్టీస్ చేశాడని డబుల్ మీనింగ్  కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. తప్పుడు అర్థంతో ఆ కామెంట్స్ చేయలేదని..లాక్ డౌన్ లో కోహ్లీ, అనుష్క క్రికెట్ ఆడిన వీడియోను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని సర్దిచెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తల కోసం..

తిరుమలలో వీకెండ్ రష్... బారులు తీరిన వెహికల్స్

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం

థాయిలాండ్ ఓపెన్లో సింధు ఓటమి