హరీశ్ రావే కేసీఆర్ వారసుడు.. ఆయన అధ్యక్షుడైతేనే బీఆర్ఎస్ ఉంటది: రాజగోపాల్ రెడ్డి

హరీశ్ రావే కేసీఆర్ వారసుడు.. ఆయన అధ్యక్షుడైతేనే బీఆర్ఎస్ ఉంటది: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వారసుడు హరీశ్ రావేనని అన్నారు. హరీశ్ రావు బీఆర్ఎస్ అధ్యక్షుడైతేనే పార్టీ ఉంటుంది..కేటీఆర్ అధ్యక్షుడైతే ఒక్కరు కూడా పార్టీలో ఉండబోరని చెప్పారు.  బీఆర్ఎస్ పార్టీ పేరు  మార్చుకుంటే మంచిదని సూచించారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్ లోకి తీసుకుంటామని చెప్పారు. 

మరో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో  కాంగ్రెస్  10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. భవిష్యత్ లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సింగిల్ గా వెళ్తే ఒక్క సీటు కూడా గెల్వదన్నారు.  భువనగిరి ఎంపీ సీటు బీసీలకు కేటాయిస్తే వారిని గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.  ఎంఐఎం తమతోనే ఉందన్నారు. ప్రభుత్వంలో ఎవరిది ఉంటే ఎంఐఎం వారితోనే ఉంటుందన్నారు.

ఏపీలో  కాంగ్రెస్ ఓట్లు చీల్చితే  వైసీపీకే లాభమన్నారు రాజగోపాల్ రెడ్డి.  వైసీపీకి ప్రభుత్వ లబ్ధిదారుల మద్దతుందన్నారు.