తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి

పరకాల, వెలుగు : కాంగ్రెస్​ కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాష్ర్ట ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా పరకాలలోని మహాదేవ కన్వెన్షన్​హాల్​లో పరకాల, పరకాల పట్టణం, నడికుడ మండలాల కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశంపట్టణాధ్యక్షడు కొయ్యడ శ్రీనివాస్​అధ్యక్షతన నిర్వహించారు.

కార్యక్రమానికి ఎమ్మెల్యే కుడా చైర్మన్​ ఇనగాల వెంకట్రామ్​రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రజాప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, పదేండ్ల పాలనలో బీసీలను చిన్నచూపు చూసింది ఎవరి హయాంలో అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్​ చందుపట్ల రాజిరెడ్డి, మండలాధ్యక్షుడు కట్కూరి దేవేందర్​రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.