పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలి

పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలి

మహబూబాబాద్: పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై దాడులు ఆపాలంటూ శుక్రవారం కొత్తగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క... ఎన్నో ఏళ్లుగా గిరిజనులు పోడు భూములను సాగు చేసుకుంటున్నారని, కానీ ఇంత వరకు వారికి పట్టాలివ్వలేదని వాపోయారు. పట్టాల కోసం పోరాడుతున్న గిరిజనులపై  అక్రమ కేసులుపెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... ఇప్పుడా హామీని మరిచిపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోడు భూములకు పట్టాలివ్వాలని సీతక్క కోరారు.