నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాడుతాం

నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాడుతాం

ములుగు: మైనర్ బాలిక రేప్ కేసు నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాడుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిందితులను తప్పించేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ, వారి ఫ్రెండ్లీ పార్టీకి చెందిన యువకులు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే కనీసం ప్రశ్నించలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారన్నారు. రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళల్లో చైతన్యం రావాలన్నారు. 

అత్యాచారాలు జరిగింది మన పిల్లల మీద కాదు కదా అని ఊరుకుంటే... ఏదో ఒక రోజుల మన పిల్లలపైన కూడా ఇలాంటి దాడులు జరుగుతాయన్నారు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు మహిళలు కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తల కోసం...

మంకీ పాక్స్ కలకలం.. ఐదేళ్ల పాపకు లక్షణాలు ? !

కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు