హరీశ్, కేటీఆర్ మాయమాటలకు కౌశిక్ రెడ్డి బలవుతుండు : ఎమ్మెల్యే యెన్నం

హరీశ్, కేటీఆర్ మాయమాటలకు  కౌశిక్ రెడ్డి బలవుతుండు : ఎమ్మెల్యే యెన్నం

హరీశ్, కేటీఆర్ మాయమాటలకు కౌశిక్ రెడ్డి బలవుతున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.  మహిళలంటే బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదని విమర్శించారు.  కౌశిక్ రెడ్డి మాటల వెనుక బీఆర్ఎస్  పెద్దలు ఉన్నారని చెప్పారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే  విధంగా  మాట్లాడిన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. 

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందన్నారు ఎమ్మెల్యే యొన్నం.   సీఎం రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారని తెలిపారు. తొమ్మిది నెలల్లో ప్రపంచంలో పేరుపొందిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని చెప్పారు. గత పదేళ్లలో కేటీఆర్ హైదరాబాద్  బ్రాండ్ ఇమేజ్ ను  దెబ్బతీశారని తెలిపారు. 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటి నిర్మి్ంచబోతున్నామన్నారు యొన్నం.

Also Read:-గాంధీ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు BRS నేతల ప్రయత్నం