కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం.. కానీ..

కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం.. కానీ..

కేసీఆర్ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన రాష్ట్ర రైతాంగాన్ని కేసీఆర్ సర్కార్ అరిగోస పెడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే చివరిదన్నారు. 75 వేలకు పైగా ఉన్న రైతు రుణమాఫీ ఆటకెక్కిస్తున్నారని విమర్శించారు. రైతులకు కొత్తగా బ్యాంకు రుణాలు ప్రభుత్వ హామీతో ఇప్పించాలన్నారు.  బ్యాంకర్ల సమావేశానికి హాజరుకాని ముఖ్యమంత్రి  దేశంలో కేసీఆర్ ఒక్కడే అన్నారు జీవన్ రెడ్డి. 

కేసీఆర్ వరి వద్దనడంతో ఈసారి సగం పంటే వస్తుందన్నారు. కోటి మెట్రిక్ టన్నులు పండాల్సిన రాష్ట్రంలో ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నులో దిగుబడి వస్తుందన్నారు. కొనుగోలుకు ప్రభుత్వం చేతులెత్తేయడంతో  రూ. 10 వేల కోట్ల విలువైన ధాన్యం దిగుడబడి తగ్గిందన్నారు. రా రైస్ కు,  బాయిల్డ్ రైస్ కు తేడా కేవలం 15 వేల కోట్ల నష్టం వస్తుందని ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే పన్ను రూపంలో 10 శాతం తిరిగి రాబట్టుకోవచ్చన్నారు. కేంద్రం పై పోరుకు కేసీఆర్ తో కలిసి మేము కూడా ఢిల్లీకి పోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ అక్కడికి పోయాక కేసీఆర్ మోదీ కాళ్ళు పెట్టుకుంటాడో, జుట్టు పెట్టుకుంటాడో తెల్వదు అంటూ ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి. 

రాష్ట్రంలో ఏ మాత్రం బలంలేని బీజేపీని ప్రతిపక్షం చేసేందుకు, ఆ పార్టీని లేపడానికే అసెంబ్లీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే లను సస్పెండ్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక పార్టీ అన్నారు. బడా వ్యాపారులకు కొమ్ముకాసే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. క్రాప్ హాలిడే ప్రకటించి భూములు బీడుగా పెట్టిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం లోనే లక్ష రుణమాఫీ చేయాలన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండానే రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. 

ఇవి కూడా చదవండి:

స్పిన్ దిగ్గజానికి తుది వీడ్కోలు