ఎండిపోతున్న పొలాలకు నీటిని విడుదల చేయాలె: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎండిపోతున్న పొలాలకు నీటిని విడుదల చేయాలె: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎండిపోతున్న పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మార్చి 14న జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టేపల్లి పోతారంలో ఎండుతున్న పొలాలను జీవన్ రెడ్డి పర్శిలించారు. వేంటనే జిల్లా సీఈతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. దీంతో సమస్య పరిష్కరిస్తామని.. పొలాలకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు సీఈ. 

అంతనరం మాట్లాడిన జీవన్ రెడ్డి.. అధికారుల నిర్లక్ష్యంతోనే పంట పొలాలు ఎండుతున్నాయని తెలిపారు. నీరు అందుబాటులో ఉన్నా.. ఇవ్వాలేని దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.  అధికారులు తక్షణమే నీరు విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.