ఇసుక మాఫియాను అడ్డుకోండి.. కేసీఆర్​కు కోమటిరెడ్డి లేఖ

ఇసుక మాఫియాను అడ్డుకోండి.. కేసీఆర్​కు కోమటిరెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా కారణంగా రోజుకు రెండు ప్రాణాలు పోతున్నాయని, వెంటనే వీరి అరాచకాలను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్​ను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  డిమాండ్​ చేశారు. గురువారం ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ప్రతి రోజు వందలాది లారీలు 150 టన్నుల ఓవర్ లోడ్​తో వెళ్తున్నాయని, దీంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఈ మధ్యే ఓవర్ లోడ్​తో దూసుకొచ్చిన లారీ కింద పడి 32 ఏండ్ల యువకుడు చనిపోయాడన్నారు. గుంతల కారణంగా జరిగిన యాక్సిడెంట్​లో ప్రశాంత్ మృతి చెందాడని తెలిపారు.  సీఎం స్పందించి.. రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు.