కేసీఆర్ ఆ మూడు చోట్లే ముఖ్యమంత్రి

కేసీఆర్ ఆ మూడు చోట్లే ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే ముఖ్యమంత్రంటూ ఎద్దేవా చేశారు. ప్రతీ గ్రామానికి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగాను హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం.. ఒకసారి వడపర్తి వచ్చి చూడాలని.. ఇక్కడ బోర్ నీళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. వడపర్తి గ్రామానికి ఒక నీటి కనెక్షన్ ఇవ్వలేదన్నారు. ఈ యాభై వేల కోట్లు ఎవరు ఏసుకొనిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు అవుతున్నా.. మాధవరెడ్డి స్వంత గ్రామాల్లో ఒక ఇల్లు కట్టలేదని ఆరోపించారు. కొండ పోచమ్మ చూసి మురిసిపోవలా...? గందమల్ల రిజర్వాయర్ లేదుగా...? అంటూ కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్య అందించిన వాడే నిజమైన పాలకుడన్నారు. తొమ్మిది ఏండ్ల తర్వాత ఇప్పుడు విద్యావ్యవస్థ మీద ఆలోచన వచ్చింది ఎన్నికల కోసమేనంటూ విమర్శించారు కోమటిరెడ్డి. ఫీజ్ రియంబర్స్ మెంట్ ఆరోగ్య శ్రీ గాలికి వదిలేశారని సీఎంపై విమర్శలు గుప్పించారు. 

ఇవి కూడా చదవండి:

తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది

కాళేశ్వరం కోసం 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు