LRS పై హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్- 131 జీవోను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. LRS కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు నష్టాలపాలవుతాయని.. ఎప్పుడో తీసుకున్న స్థలానికి మళ్లీ డబ్బులు చెల్లించాలంటే ఎలా అని పిటిషన్‌లో ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసే విదంగా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ పిటీషన్ లో పేర్కొన్నారు. ఇదే అంశం పై ఇప్పటి కే ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అన్ని పిటిషన్ లను కలిపి హైకోర్టు విచారణ జరపనుంది.
