రేవంత్ ఓ చిన్న పిల్లాడు.. పీసీసీ చాలా చిన్న పదవి

రేవంత్ ఓ చిన్న పిల్లాడు.. పీసీసీ చాలా చిన్న పదవి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైనందుకు కిషన్ రెడ్డిని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కలసి అభినందించిన వెంకట్ రెడ్డి.. భువనగిరి ఖిల్లా అభివృద్ధికి సహరిచాలని ఆయనను కోరారు. ఈ సమావేశం గురించి వెంకట్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించానని తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను చర్చించానని చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘రేవంత్ రెడ్డి ఓ చిన్నపిల్లాడు. పీసీసీ చీఫ్ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్ రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడొద్దు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పా. అభివృద్ధి పైనే దృష్టి సారించా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. పార్టీ మరే ఆలోచన లేదు. నేనేందుకు పార్టీ మారుతా? తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. నా నియోజకవర్గ ప్రజలు, జిల్లా,తెలంగాణకు అందుబాటులో ఉంటా. ప్రజా సమస్యల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతా’ అని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.