మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులో ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని.. ఎస్పీలే వెళ్తారని ఎద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తానని ఓ వ్యక్తి చెప్పారని..ఇప్పుడు ఆయననే మునుగోడును గెలిపిస్తారని వ్యాఖ్యానించారు.
తాను ఎప్పుడు విదేశాలకు వెళ్లేది కేటీఆర్ నే అడగాలని వెంకట్ రెడ్డి అన్నారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడే స్థాయి తనదికాదని.. రాజయ్యని అడిగితే చెప్తారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో భాగంగా గాంధీభవన్లో ఆయన ఓటేశారు.
