కేరళలో సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాం.. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ

కేరళలో సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాం.. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ

వయనాడ్: కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలిపారు. పార్లమెంటు లోపల, బయట దీనిపై పోరాటం చేసినట్టుగానే  ఇక్కడా వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం వయనాడ్​లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చేపట్టాని ఈసీ ప్లాన్ చేసింది. 

దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బిహార్​లో ఈసీ చర్యలకు వ్యతిరేకంగా మేం పార్లమెంటు లోపల, బయట పోరాడాం. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో సర్​కు వ్యతిరేకంగా పోరాడుతాం. ఎన్నికల్లో మోసానికి అవకాశం ఉన్న మార్గం ఇదే. బిహార్​లో సర్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రతి రాష్ట్రంలోనూ అలాగే చేయడానికి ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని ప్రియాంక పేర్కొన్నారు.