Rahul Gandhi : 25న మీడియాతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ 

Rahul Gandhi : 25న మీడియాతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ 

Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) మార్చి 25వ తేదీన మీడియాతో మాట్లాడనున్నారు. రాహుల్ ఎంపీ పదవిపై అన‌ర్హత వేటు ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు. మీడియాతో మాట్లాడ‌లేదు. అయితే అన‌ర్హత వేటు( Disqualified )పై రాహుల్ గాంధీ శ‌నివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు మీడియా( Media )తో మాట్లాడ‌నున్నారు. అన‌ర్హత వేటు దృష్ట్యా రాహుల్ ఏం మాట్లాడుతారో అని అటు కాంగ్రెస్ శ్రేణుల్లో( Congress  Leaders ), ఇటు దేశ ప్రజ‌ల్లో ఉత్కంఠ నెల‌కొంది.

ప్రధాని నరేంద్ర మోడీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూర‌త్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన క్రమంలో ఆయ‌న‌పై అన‌ర్హత వేటు ప‌డింది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు. దేశం కోసం గొంతు విప్పేందుకు తాను పోరాడుతాన‌ని, ఈ క్రమంలో ఎలాంటి మూల్యం చెల్లించేందుకైనా తాను సిద్ధంగా ఉన్నాన‌ని రాహుల్ ట్వీట్ చేశారు.