
చైన్ స్నాచింగ్ ఘటనలు మనం తరచూ చూస్తుంటాం.. రోడ్డుపై నడుస్తున్న మహిళల మెడలో నుంచి దుండగులు చైన్ లు లాక్కెళ్లడం జరుగుతుంటాయి. అయితే భద్రాతో లోపం వల్ల ఇలా జరుగుతున్నాయనుకుంటాం. అయితే దేశ రాజధాని ఢిల్లీలో అదీ హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో ఓ మహిళా ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లడం ఇపుడు కలకలం రేపుతోంది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా అందరి కళ్లు కప్పిన దుండగులు బైక్ పై వచ్చి ఎంపీ మెడలోని చైన్ ను లాక్కెళ్లారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులకే భద్రత కరువైతే .. గ్రామాల్లో రోడ్లపై సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
అసలేం జరిగిందంటే.. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ ఢిల్లీలోని అత్యంత భద్రత కలిగిన చాణక్యపురి ప్రాంతంలో ఆగస్టు 4న సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి తన మెడలో నుంచి గొలులు లాక్కెళ్లారు.ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ సుధా రామకృష్ణన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఆగస్టు 4న ఉదయం 6 : 15 గంటలకు పోలాండ్ రాయమార కార్యాలయం సమీపంలో నేను డీఎంకే నాయకురాలు రజతితో కలిసి మార్నింగ్ వాకింగ్ కు వెళ్లినపుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ టూవీలర్ వెహికల్ పైన ఎదురుగా వచ్చి నా మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. దుండగులు హెల్మెట్ పెట్టుకోవడంతో వాళ్లను గుర్తు పట్టలేకపోయా అతను గొలుసు లాక్కెళ్లేటపుడు నా మెడకు స్వల్పగాయాలయ్యాయి. నా చీర కూడా చిరిగిపోయింది. అతను బైక్ పై మెళ్లిగా వస్తున్నందును గుర్తించలేకపోయాం. ఇద్దరం సహాయం కోసం అరిచాం.
చాణక్యపురి వంటి హై సెక్యూరిటీ జోన్‌లో ఎంపీ అయిన ఒక మహిళపై ఈ బహిరంగ దాడి నన్ను ఎంతగానో బాధిస్తుంది. దేశ రాజధానిలో అదీ.. హై సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో ఒక ఎంపీ సురక్షితంగా నడవలేకపోతే, మరెక్కడ సురక్షితంగా ఉండగలం? సామాన్యుల పరిస్థితి ఏంటి.? నిందితుడిని త్వరగా అరెస్టు చేసేలా అధికారులను ఆదేశించాలని ఎంపీ హోంమంత్రికి రాసిన లేఖలో కోరారు.
►ALSO READ | పహల్గామ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ కు చెందినవారే... కీలక ఆధారాలు ఇవి..
ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.