
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తానీ ఉగ్రవాదులే అని దర్యాప్తులో తేలింది. ఇటీవల భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ కి చెందినవారేనని దర్యాప్తులో తేలింది. ఎం కౌంటర్ తర్వాత ఉగ్రవాదుల నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి భద్రతా దళాలు. పాకిస్తానీ ఓటర్ ఐడీ కార్డులు, కరాచీలో తయారు చేసిన చాక్లెట్లు, బయోమెట్రిక్ రికార్డులు కలిగిన మైక్రో SD చిప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
అంతే కాకుండా పహల్గామ్ దాడి జరిగిన ప్రదేశంలో దొరికిన షెల్ కేసింగ్ ల బాలిస్టిక్ అనాలసిస్ లో కూడా ఉగ్రవాదుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న AK - 103 రైఫిల్స్ పై ఉన్న లైన్స్ తో అవ్వడం కీలకంగా మారింది.పహాల్గమ్ ఉగ్రదాడి వెనక ఈ ముగ్గురు ఉగ్రవాదుల హస్తం ఉందని అనడానికి ఇవే కీలక ఆధారాలు అని పేర్కొన్నారు అధికారులు. ఎన్కౌంటర్ అనంతరం భద్రతా దళాలు విడుదల చేసిన పోస్ట్ ఎన్కౌంటర్ ఎవిడెన్స్ లో ఈ విషయం వెల్లడించారు.
►ALSO READ | బెంగళూరు ట్రాఫిక్ తెచ్చిన కష్టాలు: రోడ్డుపైన వాహనాలు వదిలేసి కొట్టుకున్నారు..
ఇదిలా ఉండగా... ఆపరేషన్ సిందూర్‌పై లోక్ సభలో చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ మహదేవ్‌తో పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలపై పగ తీర్చుకున్నామన్నారు. కుటుంబ సభ్యుల ముందే అమాయకులను పాశవికంగా కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్.. సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను మన జవాన్లు మట్టుబెట్టారని తెలిపారు. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులు యాసిర్, అబు హమ్జా అని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో వాడిన ఆయుధాలే ఎన్ కౌంటర్లో హతమైన టెర్రరిస్టుల దగ్గర దొరికాయని తెలిపారు.