బెంగళూరు ట్రాఫిక్ తెచ్చిన కష్టాలు: రోడ్డుపైన వాహనాలు వదిలేసి కొట్టుకున్నారు..

బెంగళూరు ట్రాఫిక్ తెచ్చిన కష్టాలు: రోడ్డుపైన వాహనాలు వదిలేసి కొట్టుకున్నారు..

 రెండు వాహనాలు ఒకదానికి ఒకటి తాకడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ నడి రోడ్డుపై కొట్టుకునే దాకా వెళ్ళింది. బెంగుళూరు సిటీ రోడ్డులో జరిగిన ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులు వాహనాలు వదిలేసి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ సంఘటన రామమూర్తి నగర్‌లో ఆగస్టు 2న రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక కారు మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. మద్యం మత్తులో ఉన్న  కారు డ్రైవర్ వాహనం నుంచి దిగి, మరో డ్రైవర్‌ను తిట్టడం స్టార్ట్ చేసాక పరిస్థితి తీవ్రమైంది. ఒకరినొకరు తిట్టుకుంటుంటుగా  ఒకేసారి ఆవేశంతో చెయ్యిచేసుకున్నట్లు రిష్వా మెహతా ఆరోపించాడు. ఈ గొడవ చూస్తుండగానే క్షణాల్లోనే  కొట్టుకునే దాకా వెళ్ళింది. 

ఈ సంఘటన తర్వాత రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా మద్యం సేవించి వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు ఇంకో కేసు వారిపై  బుక్ చేశారు. గతనెల జూలైలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. బెంగళూరులోని మోడీ హాస్పిటల్ జంక్షన్లో  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా  కొట్టారు. 

డెలివరీ ఎగ్జిక్యూటివ్ బైక్‌ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే అతని వెనుక ముగ్గురు వ్యక్తులు ఒకే  వాహనంపై  వెళ్తున్నట్లు చెబుతుండగా, ట్రాఫిక్ సిగ్నల్  పడ్డ కూడా హారన్ కొడుతూ ముందుకు వెళ్లాలని డిమాండ్ చేసారు. 

డెలివరీ ఎగ్జిక్యూటివ్ రెడ్ సిగ్నల్ పడింది, ట్రాఫిక్ రూల్స్  పాటిస్తున్నానని చెప్పడంతో ఈ వాగ్వాదం చెలరేగింది. దింతో క్షణాల్లోనే మాటలు మాటలు పెరిగి గొడవ కాస్త దాడికి దారితీసింది, ముగ్గురు వ్యక్తులు వాహనం నుండి దిగి డెలివరీ బాయ్ పై దాడి చేశారు, రోడ్డు పక్కన రక్తస్రావం అయ్యే వరకు కొట్టారు.