కాంగ్రెస్, టీజేఎస్ పొత్తుపై డైలమా

కాంగ్రెస్, టీజేఎస్ పొత్తుపై డైలమా
  • కాంగ్రెస్, టీజేఎస్ పొత్తుపై డైలమా
  • టికెట్లపై ఇంకా క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ 
  • మిగిలిన 19 సీట్లలోనైనా ఇస్తరా? లేదా? అన్నదానిపై సందిగ్ధం
    
హైదరాబాద్, వెలుగు:
కాంగ్రెస్​తో టీజేఎస్ పొత్తు అంశం కొలిక్కి రావటం లేదు. శుక్రవారం మరో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇంకో19 సీట్లను పెండింగ్​లో ఉంచింది. ఇందులో లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు ఇస్తుండగా.. మిగతా15 సీట్లలో అయినా టీజేఎస్ కు ఇస్తరా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావడంలేదు. కాంగ్రెస్ పెండింగ్​లో ఉంచిన 19 సీట్లలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ సీట్లే ఉన్నాయి. ఈ 19 సీట్లలో కూడా కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 
 
అయితే టీజేఎస్ అడిగిన 4 స్థానాల్లో (ఎల్లారెడ్డి, కోరుట్ల, ముథోల్, జహీరాబాద్) కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని కరీంనగర్​లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు పార్టీ నేతలు కలిసి ఈ 4 టికెట్లు ఇవ్వాలని కోరారు. 
 
కోదండారం ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన రాహుల్.. త్వరలో పీసీసీ చీఫ్ రేవంత్ టీజేఎస్ ఆఫీస్​కు వచ్చి చర్చలు జరుపుతారని హామీ ఇచ్చారు. అయితే రాహుల్ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి కోదండరాంతో చర్చలు జరపలేదు. దీనిపై కోదండరాం స్పందిస్తూ.. మిగతా సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మాట్లాడతానని చెప్పారు.