జాబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ రప్పా.. రప్పా.. గాంధీ భవన్‎లో మొదలైన సంబరాలు

జాబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ రప్పా.. రప్పా.. గాంధీ భవన్‎లో మొదలైన సంబరాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. ఐదు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 12 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎదురీదుతున్నారు. ఇక బీజేపీ అయితే కనీసం పోటీలో కూడా లేదు. జూబ్లీహిల్స్‎లో కమలం పార్టీ కనుమరుగైపోయింది. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సహా ప్రతి రౌండ్‎లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 

రౌండ్ రౌండ్‎కు భారీగా లీడ్ సాధిస్తూ గెలుపు దిశగా దూసుకుపోతుంది. మొత్తానికి.. జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో గాంధీభవన్‏లో సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. 

రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. మరోవైపు యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు షూరు అయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.