
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మణికం ఠాగూర్
సంగారెడ్డి టౌన్/కంది, వెలుగు: సీఎం కేసీఆర్కమీషన్లతో దేశంలోనే అతిపెద్ద ధనవంతులలో ఒకరిగా మారారని తమిళనాడు ఎంపీ, కాంగ్రెస్పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మణికం ఠాగూర్అన్నారు. సంగారెడ్డిలోని గంజిమైదాన్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్, మజ్దూర్బచావో దివస్కార్యక్రమానికి మణికం ఠాగూర్ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి బి టీంగా పనిచేస్తోందని, అంబానీని మించేలా కేసీఆర్ఆస్తులను కూడబెడుతున్నాడని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు కమీషన్లు తీసుకుని, ఎన్నికల్లో వెయ్యి, రెండువేలతో ఓట్లు కొంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని, దానికి చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2023లో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కొత్త చట్టాలు అదానీ, అంబానీలకు వ్యవసాయాన్ని కూడా తాకట్టు పెట్టేలా ఉందని విమర్శించారు.
కుటుంబ పాలనలో తెలంగాణకు అధోగతి
కేసీఆర్పాలనలో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ చీఫ్ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధిలోకి రావాలని సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే.. కేసీఆర్కుటుంబం అధోగతి పాలు చేసిందని విమర్శించారు. నూతన చట్టాల ద్వారా నిత్యావసర వస్తువులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి రేట్లు పెరిగే ప్రమాదం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేసి, వ్యవసాయ బిల్లుల రద్దుకు ఒత్తిడి తెస్తామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి మరో రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో మైనార్టీలకు12శాతం రిజర్వేషన్ మాట మరిచిపోయారని, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడా లేవని, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. పేదలకు ఇండ్లు లేవు కానీ ఆయన ప్రగతి భవన్లో టాయిలెట్ డబుల్ బెడ్రూంలను మించి ఉంటుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేశ్షెట్కార్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు
For More News..