- కొడంగల్ కాంగ్రెస్ ఇన్చార్జి తిరుపతిరెడ్డి
కొడంగల్, వెలుగు: పార్టీలు, జెండాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గ్రామ ప్రథమ పౌరుడిగా ప్రజలకు- ప్రభుత్వానికి వారధిగా ఉండి ముందుకు నడిపించే గౌరవం వారికే దక్కుతుందన్నారు. ఆదివారం కొడంగల్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆయన సన్మానించారు.
కొడంగల్ అభివృద్ధికి సీఎం ఇప్పటికే రూ.12 వేల కోట్లు కేటాయించారని, పల్లెల అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమాలు, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సర్పంచులను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్, అంబయ్యగౌడ్, యూసుఫ్, సంజీవ్ రెడ్డి, బాల్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
