
- అర్హులకే ఇవ్వాలని అమీన్పూర్లో సీఎం దిష్టిబొమ్మ దహనం
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సోమవారం అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మకు పాడె కట్టి ఊరేగించి దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 393 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
48 మంది బీఆర్ఎస్ పార్టీ నేతల అనుచరులకు దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధ, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వడ్డె కృష్ణ, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్ గౌడ్, గంగు రమేశ్, దేవదానం, హబీబ్ జానీ, శ్యాంరావు పాల్గొన్నారు.