39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
  • తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ హైకమాండ్‌
  •     కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు కూడా.. 
  •     మహబూబ్‌నగర్​కు వంశీచంద్​ రెడ్డి, మహబూబాబాద్​కు బలరాం నాయక్, జహీరాబాద్‌కు సురేశ్ షెట్కర్, నల్గొండకు రఘువీర్ రెడ్డి
  •     వయనాడ్​ నుంచి మరోసారి బరిలోకి రాహుల్‌ గాంధీ
  •     ఈ నెల 11న సెకండ్‌ లిస్ట్‌ రిలీజ్‌!

న్యూఢిల్లీ / హైదరాబాద్‌‌, వెలుగు: లోక్‌‌సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కేరళ నుంచి 16, కర్నాటక నుంచి 7, ఛత్తీస్‌‌గఢ్‌‌ నుంచి 6, తెలంగాణ నుంచి 4, లక్షద్వీప్ నుంచి 1, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన మేఘాలయ నుంచి 2, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర నుంచి ఒక్కో స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్‌‌ స్థానం వయనాడ్​ నుంచి పోటీ చేయనున్నారు. 

శుక్రవారం ఢిల్లీ అక్బర్ రోడ్‌‌లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కలిసి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అనంతరం వేణుగోపాల్‌‌ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌‌ను నిర్ణయిస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 11న మరోసారి సీఈసీ సమావేశమై, సెకండ్‌‌ లిస్ట్‌‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. 

న్యూఢిల్లీ/హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కేరళ నుంచి 16, కర్నాటక నుంచి 7, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నుంచి 6, తెలంగాణ నుంచి 4, లక్షద్వీప్ నుంచి 1, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన మేఘాలయ నుంచి 2, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర నుంచి ఒక్కో స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్‌‌‌‌ స్థానం వయనాడు నుంచి పోటీ చేయనున్నారు. 

శుక్రవారం ఢిల్లీ అక్బర్ రోడ్‌‌‌‌లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కలిసి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అనంతరం వేణుగోపాల్‌‌‌‌ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌‌‌‌ను నిర్ణయిస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 11న మరోసారి సీఈసీ సమావేశమై, సెకండ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. 

ఫస్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో నలుగురికి చోటు..

తెలంగాణలో మొత్తం 17 లోక్‌‌‌‌సభ స్థానాలు ఉండగా.. ఫస్ట్ లిస్ట్‌‌‌‌లో నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్ నగర్– చల్లా వంశీచంద్​ రెడ్డి, మహబూబాబాద్– బలరాం నాయక్, జహీరాబాద్– సురేశ్ షట్కర్, నల్గొండ– కందూరు రఘువీర్ రెడ్డికి అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వంశీ చందర్ రెడ్డి తన సీటును త్యాగం చేసి, ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అందులో భాగంగానే తనకు ఎంపీ సీటు ఇస్తామని సీఎం రేవంత్, పార్టీ హైకమాండ్ మాట ఇచ్చి, నిలుపుకుంది. నల్గొండ నుంచి పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తన కుమారుడికి సీటు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు. గతంలో భారీ మెజార్టీతో గెలిచిన మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌‌‌‌కు అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. బంజారా వర్గానికి చెందిన బలరాం నాయక్ 2009లో దాదాపు 69 వేల మెజార్టీతో గెలుపొందగా, 2014లో ఆయన ఓడిపోయారు. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షట్కర్ తన సీటును కాపాడుకున్నారు. 

సీట్లు అడుగుతున్న లెఫ్ట్ పార్టీలు

కాంగ్రెస్ విడుదల చేసే ఫస్ట్ లిస్ట్‌‌‌‌లో తెలంగాణ నుంచి 9 నుంచి 10 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అయితే వివిధ సమీకరణాల దృష్ట్యా మిగతా అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా, ఒకేసారి 10 సీట్లు ప్రకటిస్తే లెఫ్ట్‌‌‌‌తో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌‌‌‌లోకి చేరికలపై ప్రభావం ఉంటుందని, అందుకే ఆపారని స్టేట్‌‌‌‌ లీడర్లు చెబుతున్నారు. 

మరోవైపు పొత్తులో భాగంగా తమకు సీట్లు కేటాయించాలని సీపీఐ, సీపీఎం కోరుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబుబాబాద్ సీట్లు అడుగుతున్నాయి. ఫస్ట్ లిస్ట్‌‌‌‌లో నల్గొండ, మహబూబాబాద్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించటంతో ఖమ్మం, భువనగిరిలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఈ రెండు సీట్లలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి కుటుంబీకులు టికెట్ రేసులో ఉండటంతో ఈ సీట్లను ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు లెఫ్ట్ నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. 

ఈ నెల 11న సెకండ్ లిస్ట్..

లోక్‌‌‌‌సభ అభ్యర్థుల ఎంపికపై గురువారం భేటీ అయిన సీఈసీ దాదాపు 6 రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్‌‌‌‌కు చెందిన సుమారు 60 స్థానాలపై చర్చించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 నుంచి 11 సీట్లపై చర్చ జరిగినట్లు సమాచారం. చాలా చోట్ల పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం, ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌‌‌‌తో టచ్‌‌‌‌లో ఉండడం, పలు చోట్ల సీనియర్లు పోటీ పడుతున్నందున ఫస్ట్ లిస్ట్‌‌‌‌లో పలు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌‌‌‌లో పెట్టినట్లు తెలిసింది. 

ఈ నెల 11న రిలీజ్ కానున్న సెకండ్ లిస్ట్‌‌‌‌లో పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, నాగర్ కర్నూల్, భువనగిరి, సికింద్రాబాద్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాలకు ఫైనల్ లిస్ట్‌‌‌‌లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అభ్యర్థుల ఎంపికపై మున్షీ, సీఎం సుదీర్ఘ చర్చలు.. 

సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి అక్కడే బస చేశారు. సీఈసీ భేటీ తర్వాత రాత్రి 9 గంటలకు తన క్వార్టర్స్ చేరుకున్న ఆయన.. అర్ధరాత్రి వరకు పార్టీ కీలక నేతలతో చర్చలు జరిపారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌కు బయలుదేరే ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి దీపా దాస్‌‌‌‌ మున్షీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, సీనియర్లు పోటీ పడుతున్న స్థానాలపై అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ప్రధానంగా సెకండ్ లిస్ట్‌‌‌‌లో ఉండబోయే అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేసినట్లు సమాచారం. అనంతరం సీఎం రేవంత్ వెహికల్‌‌‌‌లోనే దీపా దాస్ మున్షీ ఎయిర్ పోర్ట్‌‌‌‌ వరకు వెళ్లారు. కాగా, సీఎం రేవంత్, దీపా దాస్‌‌‌‌ మున్షీతో మల్లు రవి కూడా భేటీ అయ్యారు.