
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంట్వర్షకాల సమావేశాలకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మీట్‌కు సిద్ధమైంది. ఈ నెల 15న ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలోని ఆమె నివాసమైన 10 జన్‌పథ్‌లో సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బిహార్‌లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఆపరేషన్ సిందూర్ లాంటి అనేక అంశాలపై సభలో ఎలా ప్రశ్నలు సంధించాలనేదానిపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఉభయ సభల్లోని డిప్యూటీ నాయకులు, పార్టీ చీఫ్ విప్‌లు, విప్‌లు పాల్గొంటారు. అలాగే, కొంతమంది సీనియర్ నాయకులు కూడా హాజరుకానున్నారు.