నేను కాదు..రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు

నేను కాదు..రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు

కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసినట్లు చెప్పారు ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డి. రాజీనామా లెటర్ ను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు తెలిపారు. రాజీనామా చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అంతే కాదు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం నుంచి వచ్చిన రేవంత్  రెడ్డికి పీసీసీ కట్టబెట్టడం దారుణమన్నారు. 50 కోట్ల రూపాయలతో టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. వారికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

టీపీసీసీ ప్రెసిటెంట్ అయినంత మాత్రాన  రేవంత్ రెడ్డి సీఎం అయినట్లు ఫీలవుతున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్  కు అమ్ముడు పోయాయని ప్రచారం చేస్తున్నారని.. అమ్ముడు పోయింది రేవంత్ రెడ్డి అని.. అది కూడా ..ఈటల రాజేందర్ కు అమ్ముడు పోయాడన్నారు. రేవంత్ రెడ్డికి సవాల్..కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. అంతేకాదు.. పార్టీలో ఉన్న ముఖ్యనాయకులు ఎవరూ  సంతోషంగా లేరన్నారు. త్వరలోనే హుజురాబాద్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని వర్గాల నాయకులు రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ వారితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది..అది నిజం కాదా..అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అలాంటిదేమీలేదంటూ దాటవేశారు. మరోవైపు రెండు మూడు రోజుల్లో తన కార్యకర్తలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు కౌశిక్ రెడ్డి.