మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : మంత్రి వివేక్ వెంకట స్వామి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం :  మంత్రి వివేక్ వెంకట స్వామి
  •     మంత్రి వివేక్ వెంకట స్వామి 

నర్సాపూర్, వెలుగు: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో మున్సిపల్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

మున్సిపల్ ను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​సుహాసిని రెడ్డి. మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్, జిల్లా నాయకులు కొన్యాల వెంకటేశం, పార్టీ మండల అధ్యక్షుడు  మల్లేశం, కర్రీ కృష్ణ,  పాల్గొన్నారు.

పూజల'ను పరామర్శించిన మంత్రి వివేక్ 

సిద్దిపేట: సిద్దిపేట నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి  పూజల హరికృష్ణ ను జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. పూజల హరికృష్ణ అనారోగ్యానికి గురై సిద్దిపేట పట్టణంలోని లోహిత్ సాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసుకుని మంత్రి పరామర్శించారు. 

ఈ సందర్భంగా హరికృష్ణ  ఆరోగ్య పరిస్థితిని  తెలుసుకుని అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని డాక్టర్లకు సూచించారు. హరికృష్ణ  త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు. మంత్రి వివేక్  వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.