గాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ శ్రేణుల నిరసన

గాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ శ్రేణుల నిరసన

ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ధర్నా చేయడంలేదని రాహుల్ గాంధీకి చెందిన 2వేల కోట్ల ఆస్తుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అక్రమాస్తుల్ని కాపాడేందుకు  కాంగ్రెస్ నేతలు నిరసనలతో దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెస్తున్నారని..అయితే చట్టం ముందు ఎవరు గొప్పకాదని అన్నారు. వార్తాపత్రికను నడిపించాలన్న ఉద్ధేశ్యంతో 1930లో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ను స్థాపించినట్లు చెప్పారు. అప్పుడు ఆ పత్రికలో 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులున్నారని కానీ ఇప్పుడు ఆ సంస్థ గాంధీ ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లిందన్నారు.

ఆ పత్రికను రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చారని స్మృతి ఇరానీ విమర్శించారు. దాతలు విరాళంగా ఇచ్చిన డబ్బును కాంగ్రెస్ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా గాంధీ కుటుంబానికి లాభం చేకూర్చడానికి ఉపయోగించిందని ఆరోపించారు. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్ధతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఏజెఎల్ కంపెనీకి 90కోట్ల రుణం ఇచ్చిందని..ఆ తర్వాత దానిని మాఫీ చేసిందని కేంద్రమంత్రి తెలిపారు.