కాంగ్రెస్ తోనే ఖేడ్ అభివృద్ధి : మంత్రి అజారుద్దీన్

కాంగ్రెస్ తోనే  ఖేడ్ అభివృద్ధి :  మంత్రి అజారుద్దీన్
  •     మంత్రి అజారుద్దీన్

నారాయణ్ ఖేడ్, వెలుగు: కాంగ్రెస్ హయాం లోనే నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సోమవారం ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలసి ఖేడ్ టౌన్ లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్​లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

ఖేడ్ కాంగ్రెస్ కు కంచుకోటని గుర్తు చేశారు. గత పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు అందుతున్నాయన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఖేడ్ రింగ్ రోడ్డు, పట్టణంలోని బైపాస్ రోడ్డు పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.